Suryakumar Yadav should continue batting at No. 3 when Virat Kohli returns to T20I side: Gautam Gambhir
#ViratKohli
#Teamindia
#IndVsNz
#SuryaKumarYadav
#RohitSharma
#Gambhir
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చినా.. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలోనే ఆడాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో సూర్య (63; 50 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన గంభీర్.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య అన్ని వైపులా షాట్లు ఆడగలడని, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడని ఆయన పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ తిరిగొచ్చినా అతడినే మూడో స్థానంలో చూడాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను చెప్పాడు.